Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం

డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో, రాజ్యాంగ సవరణ చేసేంతవరకు తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత, నిరంతర ప్రజాస్వామ్యత పోరాటం కొనసాగుతుందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ అన్నారు. శుక్రవారం అయన స్థానిక రోటరీ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా మిత్రులారా,sc ఎస్సీ వర్గీకరణ పేరుతో, అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా
మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని దోపిడీదార్లుగా చిత్రీకరించాయి, దీన్ని మనమంతా ఐక్యంగా ఎదుర్కొని పోరాడాలి, లేకపోతే మన సామాజిక వర్గం ఉనికి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కనబడకుండా పోతుంది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టాలు చేసేసారు కదా అంతా అయిపోయింది కదా అనుకోకండి, ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీమ్, ప్రజలు కరెక్ట్ గా పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైన తోక ముడిసి చేసిన కుట్రపూరిత చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిందే అన్న విషయాన్ని మీరంతా తెలుసుకోవాలి, అపూర్వ సహోదరులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్య లేనట్టు, ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి హామీలను డైవర్ట్ చేసేందుకు, ఎస్సీ వర్గీకరణ తలపైకి తీసుకొచ్చారు, ఎస్సీ వర్గీకరణ ముసుగులో బిజెపి పోనీ దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతను దెబ్బతీసి, దళితులు ఎప్పటికీ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు, దేశవ్యాప్త కుట్రకు తెర లేపారు, రిజర్వేషన్ పేరుతో, వందలో దాదాపుగా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతోంది, వందలో ఇద్దరికీ ఇచ్చే ఈ బెనిఫిట్స్ ని, వర్గీకరణ పేరుతో, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? అలాగే ఈ రెండు బెనిఫిట్స్ ని మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? కాబట్టి ఎస్సీ వర్గీకరణ ముసుగులో, దళిత జాతిని విచ్ఛిన్నం చేస్తాం అన్నటువంటి ఈ టైంలో, మనమంతా ఐక్యంగా పోరాడని మనవి చేస్తూ ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం దళిత సంఘ నాయకులు సల్ల దేవరాజ్, పొట్నూర్ భగవాన్, నూతలపాటి బాబురావు, దడ్డ చంద్ర శేఖరం, బాగ మోహన్ రావు, నెల్లి సూరిబాబు, బడియా నాగేశ్వర్ రావు, పందిరి లోకేష్, మద్దిల కేశవరావు, ఎస్. చంద్రశేఖర్, పందిరి కేశవరావులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments