Wednesday, June 3, 2026
HomePoliticsAndhra Pradeshపంచాయతీ నిధులతో మెట్లు మార్గం నిర్మాణం

పంచాయతీ నిధులతో మెట్లు మార్గం నిర్మాణం

మాడుగుల సమీపంలో సాగరం వెళ్లె రహదారిలో తాచెరు నదిలో కి వెళ్లేందుకు భక్తులు సౌకర్యం పంచాయతీ నిధులతో మెట్లు మార్గం నిర్మాణానికి గురువారం భూమి పూజ నిర్వహించారు.గతంలో రైతుల కోరిక మేరకు మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఇచ్చిన హామీతో మాడుగుల సర్పంచ్ యడ్ల కళావతి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు పొలిమేర విజయలక్ష్మి, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు, అనకాపల్లి జిల్లా ఐవీఎఫ్ఆర్యవైశ్య సంఘ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీనాథు శ్రీనివాసరావు, కో ఆప్షన్ నెంబర్ షేక్ ఉన్నిష,వైసిపి పట్టణ అధ్యక్షులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో తాచేరునది పక్కనే శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేయడంతో కార్తీకమాసంలో భక్తులు మెట్లు ద్వారా నదిలోకి దిగి స్నానాలు చేసేందుకు ఈ మెట్లు ఉపయోగపడతాయని వారు తెలిపారు. భక్తులకు మెట్లు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కు పంచాయతీ సర్పంచ్ పాలకవర్గానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్ శీలమంతుల జ్యోతి రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments