వడ్డాదిలో సీసీ రోడ్దు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ నుండి రూ.55 లక్షలు నిధులు మంజూరు చేశారు.ఆదివారం ఎమ్మెల్యే రాజు సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. స్థానిక కూటమి నేతలతో కలిసి సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కోరుకొండ కామ లక్ష్మీ సూరప్పారావు ప్రారంభించారు. స్థానిక కొత్తూరు రామాలయం వద్ద, కృష్ణుడి గుడి వద్ద, ఎన్టీఆర్ కాలనీలలో సిసి రోడ్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జేసీబీతో రోడ్డు లెవెలింగ్ చేస్తున్నారు.నిర్దేశిక సమయంలోగా నాణ్యతా ప్రమాణాలకు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.ఎమ్మెల్యే రాజు వడ్డాది గ్రామాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు.రూ.55 లక్షల మంజూరు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతల దొండా గిరిబాబు,సిరిగిరి శెట్టి శ్రీరామమూర్తి, సింగంపల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ పేరమ్మ,అరిసింగల వాసు, తదితరులు పాల్గొన్నారు
వడ్డాదిలో రూ.55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
RELATED ARTICLES
