చోడవరం మండలం గవరవరం హైస్కూల్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక పద్ధతి చేయించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం గురించి విద్యార్థిలకు సోషల్ ఉపాధ్యాయుడు వివరించారు. అనంతరం విద్యార్థులతో మా అసెంబ్లీ మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇతర ఉపాధ్యాయులు బహుమతి ప్రధానం చేశారు.
