Sunday, January 18, 2026
HomeNewsచోడవరం డిగ్రీ కళాశాలలో ఘనంగా"రాజ్యాంగ దినోత్సవం"

చోడవరం డిగ్రీ కళాశాలలో ఘనంగా”రాజ్యాంగ దినోత్సవం”

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో బుధవారం 76వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల అధ్యక్షులు డాక్టర్ పి కిరణ్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ ఐ.వి సత్యవతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రచన చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.

భారత ప్రభుత్వము,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము,ఉన్నత విద్యాశాఖ ఎన్ఎస్ఎస్ ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ అధ్యాపకులు విద్యార్థుల చేత పీఠిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులు వక్తృత్వ పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజ్యాంగ రచన కొరకు భారతదేశ ప్రభుత్వము 259 మంది సభ్యులను నియమించగా వారిలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తును నియమించి, రచనా కార్యక్రమానికి 7 సభ్యుల కమిటీని ఏర్పరిచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని చైర్మన్గా నియమించారన్నారు. 1949 నవంబర్ 26న రచన కమిటీ ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ను ఆమోదించారు. 125 సంవత్సరాల అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని 2015 భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన రాజ్యాంగ దినోత్వం జరుపుకోవాలని తీర్మానం మేరకు,ఈ కార్యక్రమాన్ని జరుగుతుందని తెలియజేశారు. వక్తృత్వ పోటీలో మొదటి స్థానాన్నికే సంధ్యారాణి, ద్వితీయ స్థానాన్ని వై దనలక్ష్మి,తృతీయ స్థానాన్ని ఎస్ శాంతి, కన్సోలేషన్ బహుమతులుగా కే రమ్య,కే.కుమారి,పీ.మేరీ లకు లభించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments