Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshఅంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించండి

అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించండి

న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సోమవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలుస్తున్నామని అంగన్వాడి టీచర్లను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యలని సిఐటియు వమాడుగుల మండల నాయకులు ఇరట నరసింహమూర్తి పేర్కొన్నారు మంగళవారం మాడుగులలో అంగన్వాడీలతో కలిసి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే అంగన్వాడి అందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేస్తున్నప్పుడు అంగన్వాడీ టీచర్ల టెంట్ వద్దకు వచ్చి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు.ఇప్పుడు అదికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న మా సమస్యలు పరిష్కారం చేయండని అంగన్వాడీలు శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు ఈ అరెస్టులు తో అంగన్వాడి టీచర్లు భయపెట్ట లేరని మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మరింతగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆరేస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని న్యాయమైన సమస్యలు డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు డి.కోండాజి. ఎల్. వరలక్ష్మి. జి.సరోజిని. జి.దేవి. సత్యవతి. రూప. వరలక్ష్మీ. రామలక్ష్మి. పావని ఆయాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments