Sunday, January 18, 2026
HomeNewsనూతన అంబులెన్స్ ప్రారంబించిన కలెక్టర్

నూతన అంబులెన్స్ ప్రారంబించిన కలెక్టర్

పాడేరు,(జయ జయహే): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ కు సంబంధించి రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది. జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఏఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె. చిరంజీవి నాగ వెంకట సాహిత్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన అంబులెన్స్ ను లక్ష్మివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం విస్తృతంగా పనిచేస్తుందని, అధికారులందరూ రెడ్ క్రాస్ సొసైటీ కి సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యవర్గం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అన్నారు. డిసెంబర్ లో జనరల్ బాడీ నిర్వహించి పూర్తిస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీవోలు, తహసిల్దార్లు, మండల విద్యాశాఖ అధికారూలతో టీముగా ఏర్పాటు చేసి విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. రక్తపు నిలువలను పెంచేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపడతామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments