వనవాసి కళ్యాణి ఆశ్రమానికి బోరు వెల్ మంజూరు*
హుకుంపేట మండలం మఠం గ్రామంలో అనాధ పిల్లల ఆశ్రమం వనవాసి కళ్యాణి ఆశ్రమంలో బోర్వెల్ మంజూరు చేస్తామని అల్లూరి కలెక్టర్ *దినేష్ కుమార్ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. అంబేద్కర్ జర్నలిస్టు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఏర్పాటుచేసిన విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు వివిధ పరికరాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో మఠం సర్పంచ్, భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి వనవాసి కళ్యాణి ఆశ్రమం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే బోర్వెల్ కు తాను నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని కలెక్టర్ దినేష్ కుమార్ నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణి ఆశ్రమంలో బోర్వెల్ కొట్టించే పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ సర్పంచ్ శాంత కుమారి వనవాసి కళ్యాణి ఆశ్రమం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం శాంత కుమారి తో పాటు వార్డ్ మెంబర్ మత్స్యకొండ బాబు , వనవాసి కళ్యాణ ఆశ్రమం మహిళలు పాల్గొన్నారు.
