Home Politics Andhra Pradesh అకాల నష్టం

అకాల నష్టం

0

1,215 హెక్టార్లలో పంట నష్టం

ఆరు జిల్లాల్లో 16 మండలాల్లో తీవ్ర ప్రభావం

సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడి

అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై వర్షం అధిక ప్రభావం చూపుతోందని అధికారులు అన్నారు. మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. పూర్తిస్థాయిలో పంటనష్టాన్ని వెంటనే లెక్కించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. అలాగే ఉపాధి కల్పనపై సీఎం చంద్రబాబు చర్చించారు. జాబ్‌ ఫస్ట్‌ అనేది కూటమి ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. మే 15వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version