Home Politics Andhra Pradesh బంగారం భారీ తగ్గుదల

బంగారం భారీ తగ్గుదల

0

అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. మార్చి 19న సాయంత్రం 5:30 గంటల సమయంలో హైదారాబాద్ బులియన్ మార్కె‌ట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,50,280కు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.7140 మేర తగ్గుదల నమోదు చేసింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,750 దగ్గర ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.6550 మేర తగ్గింది. మరోవైపు వెండి ధరల్లో కూడా తగ్గుదల కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.65 లక్షలుగా ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version