Sunday, April 19, 2026
HomeNewsకొత్తపేట హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

కొత్తపేట హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

యలమంచిలి, జయ జయహే న్యూస్ : యలమంచిలి కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై వి రమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం నెహ్రూ బాల్యం విద్యాభ్యాసం పిల్లల పట్ల ఆయనకున్న మమకారం తదితర అంశాలపై విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుందూరు రాజు, శ్రీనివాసరావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, కిషోర్ కుమార్, అమరావతి, రామలక్ష్మి అపర్ణ, విజయ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments