Home Politics Andhra Pradesh మాధవధారలో ‘చాలెంజ్ జిమ్’ ప్రారంభం

మాధవధారలో ‘చాలెంజ్ జిమ్’ ప్రారంభం

0

వ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : సీపీ డా. శంఖబ్రత బాగ్చి
విశాఖపట్నం నగరంలోని మాధవధార మసీదు సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చాలెంజ్ జిమ్ ను విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో, అన్ని రకాల నూతన వ్యాయామ పరికరాలతో ఈ జిమ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మరియు విశాఖ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిమ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక ఎక్విప్మెంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ డా. శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రజల్లో శారీరక చురుకుదనం తగ్గుతోందని, ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరం అనేక మందిలో రోగ నిరోధక శక్తి బలహీనమైందని పేర్కొన్నారు. రోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీర దారుఢ్యం పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా జిమ్‌ను ప్రారంభించిన టి. మణికంఠను కమిషనర్ అభినందిస్తూ, యువతను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దిశగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐదవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ట్రూత్ న్యూస్ చానల్ ఎండీ కిట్టు,
డైరెక్టర్ శ్రీనివాస్, జిమ్ నిర్వాహకుడు టి. మణికంఠ, గేదెల వెంకటేష్, బమ్మిడి వెంకటేష్, భార్గవ్, మైకేల్ దిలీప్, రామ్ ప్రసాద్,ఎన్. మనోజ్, చంటి తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version