Home Politics Andhra Pradesh రహదారి జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం

రహదారి జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం

0

విజయనగరం ఆర్టీసీ డిపోలో
జాతీయ రహదారి భద్రత మాసము లో భాగంగా  ఆర్టీసీ డిపో డిస్పెన్సరీ వద్ద రోటరీ క్లబ్ విజయనగరం వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం శిబిరాన్ని జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మరియు ఆర్.టి.సి. మెడికల్ ఆఫీసర్ కె ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి డ్రైవర్ లు, కండక్టర్ లు, మెకానిక్ లు, సెక్యూరిటీ మరియు అన్ని సెక్షన్ ల సిబ్బంది , ఔట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం 32 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా డి పి టి ఓ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని,ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని కోరారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు మరియు అసిస్టెంట్ డిపో మేనేజర్ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version