Monday, April 20, 2026
HomeNewsఘనంగా తెలుగుదే శం పార్టీ ఆవిర్భావ సంబరాలు .

ఘనంగా తెలుగుదే శం పార్టీ ఆవిర్భావ సంబరాలు .

పేద ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ

పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు .. నేడు
తెలుగువారి ఆరాధ్యదైవం అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో విజనరీ లీడర్, సీఎం చంద్రబాబు నాయకత్వంలో 44 ఏళ్లుగా తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపు కుంటున్నామని నాయకులు పేర్కొన్నారు.జంగారెడ్డిగూడెం పట్టణంలో తెదేపా జెండా వాడవాడలా ఘనంగా ఎగిరింది.ఇక్కడి కాకర్ల కాంప్లెక్స్ సెంటర్ లో గల అన్న నందమూరి విగ్రహం వద్ద ఆదివారం ఉదయం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు.పాల్గొని తమ అభిమానం చాటి చెప్పారు.
తొలుత అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

నలభై నాలుగేళ్ళ ఆవిర్భావ సంబరాలు.

ఈ సందర్భంగా పట్టణపార్టీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ 1982 మార్చి 29న మన తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో అన్న ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని, పేద బడుగు బలహీన వర్గాలకు కూడు,గూడు,గుడ్డ, పేదలకు అందించి,మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి,రాజ్యాధికారం కల్పించిన మహానాయకుడు ఏన్.టి.ఆర్ అని అన్నారు. నేను తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే, నా రాజకీయ పార్టీ అని ఎన్టీఆర్ పార్టీ స్థాపించారన్నారు. కులమతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారని అన్నారు.
ఇదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ పార్టీని నడిపిస్తున్నారన్నారు.
టీడీపీ తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమైందన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పార్టీ పెద్దపీట వేసిందన్నారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు,పరిమి సత్యనారాయణ,చిట్టిబోయిన రామలింగేశ్వరావు, రావూరి కృష్ణ,బొబ్బర రాజ్ పాల్,పాకనాటి ఝాన్సీ, ప్రధాన కార్యదర్షి కోనేటి చంటి,పెనుమర్తి రామ్ కుమార్, షేక్ ముస్తఫా,చెరుకూరి శ్రీధర్,గుమ్మడి ప్రసాద్,అబ్బిన దత్తాత్రేయ,దాకారపు కృష్ణ,చిట్రోజు తాతాజీ, కరుటూరి రమాదేవి,మారిశెట్టి సత్యనారాయణ,పగడం సౌభాగ్యవతి,గుళ్ళపూడి శ్రీదేవి,కోటగిరి ప్రమీల, మహంకాళి రాంబాబు,మార్గాని వినూతన మరియూ వార్డు అధ్యక్ష,కార్యదర్శిలు,పట్టణ టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments