Home News ‘ప్రేమ బంధు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో “మజ్జిగ చలివేంద్రం”

‘ప్రేమ బంధు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో “మజ్జిగ చలివేంద్రం”

0

ప్రేమ బంధు ఫౌండేషన్, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో 42వ డివిజన్, కామాక్షి నగర్ అయ్యన్నపేట మున్సిపల్ వాటర్ ప్లాంట్ వద్ద వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ నిర్వహించిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఏ తిరుపతిరావు రిబ్బన్ కట్ చేసి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

అనంతరం తిరుపతిరావు, గౌరవ అధ్యక్షుడు, గౌరవ సలహాదారులు పిన్నింటి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న ఈ వేసవిలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. ఈ క్రమంలో ప్రేమ బంధు ఫౌండేషన్, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ అభినందించారు. ఎలెక్ట్ గవర్నర్ టీ చిరంజీవి రావు మజ్జిగ చలివేంద్రంనకు మొదటి రోజున స్పాన్సర్ చేయగా.., క్లబ్ గౌరవ అధ్యక్షులు గౌరవ సలహాదారులు పిన్నింటి సూర్యనారాయణ మజ్జిగ చలివేంద్రం నిమిత్తం 5000 రూపాయలు విరాళం అందించారు.
క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ, క్లబ్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏడాది మజ్జిగ చలివేంద్రాన్ని వేసవిలో సుమారు మూడు నెలల పాటు క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా సుమారు మూడు నెలలు పాటు క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో, ప్రేమ బంధు ఫౌండేషన్ తో సంయుక్తంగా నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో శ్రీ సాయి కృష్ణ వాకర్స్ క్లబ్, బాలాజీ వాకర్స్ క్లబ్, తోషిని వాల్ వాకర్స్ క్లబ్, ప్రగతి వాకర్స్ క్లబ్, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్, ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొనగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version