Home News విద్యుత్ తీగలు తగిలి బస్సు దగ్ధం

విద్యుత్ తీగలు తగిలి బస్సు దగ్ధం

0

డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

21 మంది ప్రయాణీకులు సురక్షితం

జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు 11కేవీ విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే జిల్లా అధికారులకు ఫోన్ చేశారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. విద్యుత్ తీగ తగలడం వల్లే బస్సు దగ్ధమైందని మంత్రికి అధికారులు వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. వారంతా సురక్షితంగా బయపడ్డారని తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణనష్టం తప్పిందని మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version