Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshమహిళా న్యాయవాది హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ

మహిళా న్యాయవాది హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ

నిందితులను కఠినంగా శిక్షించాలి వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది స్వప్నను తన సోదరుడే హత్య చేయడం దారుణమని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం అన్నారు. గురువారం హత్యకు నిరసనగా కోర్టు ప్రధాన ద్వారం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సదానందం మాట్లాడుతూ న్యాయవాదిగా స్వప్న ప్రాక్టీస్ చేస్తూ ఎదుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించి వారి తరఫున ఏ న్యాయవాది వకాలత్ వెయ్యోద్దని న్యాయవాదులను కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, మహిళ రిప్రజెంటివ్ జక్కుల పద్మ, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments