పార్లమెంట్ స్థానంపై వైసీపీ ఫోకస్ మళ్ళీ మాజీ ఎంపీ ఎంవీవీ ని యాక్టివేట్ చేసే యత్నంలో వైసీపీ వైఎస్సార్ ఆవిర్భావం నుంచో ఎన్నో కష్టనష్టాలు, జయాపజయాలను చవి చూసింది. 2014లో ఓడినా, 2019లో అఖండ మెజార్టీతో అధికారం పీఠాన్ని కైవశం చేసుకున్నా, నిన్నటి ఎన్నికల్లో చితికిల పడినా సరే ఆ పార్టీకి ఓ అంశం మానని గాయంలా తయారైందట. రాష్ట్రంలో అత్యంత కీలకమైన, అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖ పార్లమెంట్ స్థానంలో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోవడం కలవరం పరుస్తోంది. రాష్ట్రం నలుమూలలా అన్ని చోట్లా జెండా రెపరెపలాడినా, సాగర నగరం విశాఖ ఎంపీ స్థానంలో మాత్రం రెక్కలు విరుగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ట్రయాంగిల్ ఫైట్ లో విశాఖ ఎంపీ సీటును వైసీపీ గెలిచినా సరే, అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఇటీవల ఎన్నికల్లో కూటమి అబ్యర్థులు విశాఖలో స్టేట్ లెవల్లో రికార్డు స్థాయి మెజార్టీలు సాధించగా, వైసీపీ అభ్యర్థులు కనీస పోటీని ఇవ్వలేక చేతులేత్తేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇక కొలుకునే పరిస్థితి ఉండదని వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. అందుకే విశాఖ వైసీపీ ఫుల్ పోకస్ పెట్టారని సమాచారం వైఎస్సార్ సీపీ అధిష్టానం ఇటీవల పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. పార్లమెంట్ స్థానాలు, మండలాల వారీ పార్టీ కమిటీలను పూర్తి చేయడం, తర్వాత రాష్ట్రస్థాయి కమిటీని నియమంచడం ద్వారా కొత్త నీరును తీసుకురావడం కోసం కసరత్తు చేస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ఉత్తేజం రగిలించి క్యాడర్ ను యాక్టివేట్ చేయడం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటాలకి దిగి ప్రజలకు మళ్లీ చేరువ కావాలని ప్లాన్ చేస్తోంది. అయితే పార్టీకి సవాల్ గా మారిన విశాఖ ఎంపీ స్థానంలో ఇన్ చార్జిగా బలమైన నేతను బరిలోకి దించాలని వైసీపీ పకడ్బందీగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేసారు. ఆర్థికంగా, సామాజకంగా, రాజకీయంగా పొరుగున ఉన్నఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బలమైన నాయకురాలుగా ఆమెను పార్టీ బరి నిలిపితే గౌరవ ప్రదమైన ఓట్లను కూడా సాధించలేక చేతులెత్తేసారు. కనీసం 30 శాతం ఓట్లను కూడా సాధించలేక చితికిల పడ్డారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బొత్స ఝాన్సీ సొంతూరు విజయనగరం జిల్లాకు మాత్రమే పరిమితమై, విశాఖ వైపు కన్నెత్తి చూడటం మానేసారు. గత కొన్నాళ్లుగా విశాఖకు చెందిన అంశాలపై రాజకీయంగా రచ్చ రచ్చ జరుగతున్నా సరే ఆమె ఎక్కడా కనపడలేదు. వాయిస్ ను వినిపించలేదు. పోనీ, విజయనగరంలోనైనా సరే పార్టీ లైన్ ను ఆమె ఎక్కడా వినిపించడం లేదు. దీంతో బొత్స ఝాన్సీ ఇప్పుడు విశాఖ ఎంపీ స్థానంలో బాధ్యతలు చేపట్టడానికి సముఖంగా లేరని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం కూడా ఇదే అంశాన్ని గ్రహించిందట. దీంతోె విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేలా బలమైన నాయకుడు కోసం టార్చ్ ఆన్ చేసిందని టాక్. స్టీల్ సిటీ విశాఖలో పార్టీకి ఉక్కులాంటి నేత కోసం వైసీపీ పెద్దలు వెతుకాలట మొదలుపట్టారట. ఎంత చూసినా సరే పెద్దగా ఆప్షన్స్ కనబడటం లేదట. దీంతో సరికొత్త ప్లాన్ దిశగా పార్టీ పెద్దలు అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారంలో ఉంది. గతంలో విశాఖ పార్లమెంట్ కు వైసీపీ నుంచి ఎన్నికైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారయణనే ప్రస్తుతానికి బెస్ట్ ఆప్షన్ గా భావిస్తున్నారట. గత ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆయన్ను తిరిగి రీయాక్టివేట్ చేయడం ద్వారా క్యాడర్ కు మంచి సంకేతాలు పంపాలని తలపోస్తున్నారని వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోందట. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎంవీవీ ఎక్కడా కనిపించడం లేదు.. వినిపించడం లేదు. పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తన వ్యాపారల వ్యవహారాలను మాత్రమే చక్కబెట్టుకుంటున్నారు. అలాగే ఎంవీవీ కూడా వ్యాపార రంగంలో ఉన్నందున అధికార పార్టీలకు భయపడిపోయిన వైసీపీ రాజీనామా ఇప్పటి వరకు చేయలేదు. అలాగే ఓటమి తర్వాత పార్టీని గాలికి వదిలేశారని అధిష్టానం కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా పార్టీ అధినేత జగన్ తో జరిగే ప్రతీ సమావేశాలకు ఎంవీవీకి ఆహ్వానం ఇప్పటికీ అందుతూనే ఉంది. పార్టీ ఆయన్ను దూరం పెట్టినట్లు ఎక్కడా కనబడటం లేదు. దీంతో ఇప్పుడు ఎంవీవీని యాక్టి వేట్ చేస్తే విశాఖ ఎంపీ సీటుతో పాటుగా ఈ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోని క్యాడర్ కూడా ఊపు వస్తుందని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారట. కూటమి అధికారంలోకి రాగానే ఎంవీవీకి చెందిన హయగ్రీవ ప్రాజెక్ట్స్, సిరిపురంలోని ఎంవీవీ పీక్ వంటి భారీ నిర్మాణాల అక్రమాలు, అవకతవకలపై కన్నెర్ర చేసింది. దీంతో ఎంవీవీ పొలిటికల్ గా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు తిరిగి రీయాక్ట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. లేక కూటమి పవర్ కు వెనకడుగు వేసి మొహం చాటేస్తారా.. అన్నది క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే..
విశాఖ నుంచి బొత్స ఝాన్సీ అవుట్ ?
RELATED ARTICLES
