Home Politics National అభివృద్ధికి పట్టం కట్టిన బీహారీయులు…అభినందనలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ‎

అభివృద్ధికి పట్టం కట్టిన బీహారీయులు…అభినందనలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ‎

0

అభివృద్ధికి పట్టం కట్టిన బీహారీయులు
……….
అభినందనలు తెలిపిన
ఎంపీ పుట్టా మహేష్ కుమార్

‎ఏలూరు/ఢిల్లీ, నవంబర్, జయ జయహే
ప్రతిపక్ష కూటమి  ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీహార్ యువత, ప్రజలు వాటిని నమ్మకుండా, విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయటం సంతోషకరమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హార్షం వ్యక్తం చేశారు. ఎన్ డి ఏ కి ఈ అద్భుత విజయం అందించిన బీహార్ ఓటర్లకు గురువారం ఓ ప్రకటన లో ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
‎..  డబల్ ఇంజన్ సర్కార్ తో ఇక బీహార్ లో అభివృద్ధి మరింత వేగంగా దూసుకెళుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఆభివృద్ధి అనేది నిరంతరాయంగా కొనసాగాలంటే ఏ రాష్ట్రంలోనైనా ఒకే ప్రభుత్వం స్థిరంగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బీహార్ లో ఘన విజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు, ఎల్జేపీ(ఆర్ వి ) నేత చిరాగ్ పాశవాన్ కు, ఇతర ఎన్డీఏ నేతలకు, అదేవిధంగా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీఏ కూటమి విజయానికి తనవంతు కృషి చేసిన యువనేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. వికసితభారత్ లక్ష్యాలను చేరుకోవడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి బీహార్ విజయం మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version