భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు
మల్లెల రాజశేఖర్ గౌడ్, తి.తి.దే.ధర్మకర్తల మండలి సభ్యులు
కర్నూలు జయ జయహే: గీతా జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న భగవద్గీత కంఠస్థ పఠణ పోటీలలో భాగంగా ఈ సంవత్సరము నంద్యాల జిల్లాకు గాను ఈనెల 23వ తేదీన డోన్ పట్టణంలోని శ్రీసుధా విద్యాసంస్థల నందు పోటీలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను వారు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. విద్యార్థులకు బాల్యం నుండే భగవద్గీత నేర్పడం వల్ల విద్యార్థులలో నైతిక విలువలు పెరగడంతోపాటు, మనోధైర్యం కూడా పెరుగుతుందని అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు “ప్రతి ఇంటా భగవద్గీత – ప్రతి నోటా భగవద్గీత” అని సంకల్పించుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం పోటీల విధివిధానాలు మూడు విభాగాలుగా నిర్వహించనున్నారని,నిత్యజీవితంలో భగవద్గీత – భావ విశ్లేషణ” అనే అంశంపై ఈ పోటీలు నంద్యాల జిల్లాకు, కర్నూలు జిల్లాకు విడివిడిగా పోటీలు నిర్వహించబడునని, త్వరలో కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న పోటీల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు. ప్రతి విభాగం నుండి విజేతలను గుర్తించి వారికి ప్రధమ బహుమతి రూ1116-00, ద్వితీయ బహుమతి రూ816-00, తృతీయ బహుమతి రూ516-00 అందించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, కళ్యాణ మండపం మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, ప్రసాద్, విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, లలితకళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, మద్దికుంట రాంభూపాల్ రెడ్డి, ఆవోపా నాగేశ్వరరావు, గోదాగోకులం బృందం, తరిగొండ వెంగమాంబ సేవాసమితి పి. నీలిమ, యోగామాష్టర్ బి. జయలక్ష్మి, శ్రీరామపట్టాభిషేక మహోత్సవ సమితి ప్రతినిధులతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
