అరకులోయ మండలం కేంద్రంలో బినామీ దారుల పేరున రిసార్ట్స్లు, పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు నిర్మిస్తున్నారని, అమాయక గిరిజనులకు ప్రమాదాల్లో పడేస్తున్నారని, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి లబ్ది ఫలాలను దూరం చేస్తున్నారనీ, ప్రభుత్వము నుండి పొందే రేషన్ కార్డు రద్దు కాబడుతున్నాయని, అరకులోయ స్థానిక గిరిజనులు బినామీ అక్రమ నిర్మాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజనులకు తెలియక బినామీ దారుల మాయలో పడి గిరిజనులు నష్టపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు. చిన్నలబుడు పంచాయితీ గొందివలస గ్రామ సమీపంలో కొండపల్లి రిసార్ట్స్ ఓ గిరిజనేత్రుడు గిరిజనుడిని అడ్డుపెట్టుకొని నడుపుతున్నాడనీ పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అనుమతులు రెవెన్యూ అనుమతులు లేకుండా రిసార్ట్స్ నడుపుతున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా గిరిజననేతరులు బినామీ రిసార్ట్స్ పై క్రయవిక్రయాలు జరుపుతున్నారని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక బినామి దారుడు నిర్మాణాలు చేపట్టి అతను ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రి పాలైన తర్వాత తక్కువ ధరలో వారి బంధువులు ఓ గిరిజనేత్రుడకి విక్రయించుకున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పంచాయతీ రికార్డులలో రెవెన్యూ రికార్డులలో బినామిదారుల పేరున రిసార్ట్స్లో నమోదు లేకుండానే చలామణి జరుగుతున్నాయని స్థానిక గిరిజనులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసుకున్న తర్వాత ఆ రిషార్ట్ కొండపల్లి అని నామకరణం చేసి ప్రస్తుతం వ్యాపారం సాగిస్తున్నాడనీ. చినలబుడు పంచాయతీ కార్యదర్శి,మండల తాహాశీల్దార్ వివరాలు అడిగితే మా వద్ద నుండి అనుమతులు పొందలేదని వారు స్పష్టం చేశారు. దీనిపై పాడేరు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్ డి ఓ పూర్తిస్థాయిలో విచారణ చేసి కొండపల్లి రిషార్ట్ పై శాఖపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లాడ్జిలు గ్రామాలు మధ్య ఉండడంతో చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో గిరిజనుల సొంత గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని, చుట్టు పక్కల గ్రామ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అనుమతులు లేకుండా బినామీ పేరుతో నడుపుతున్న కొండపల్లి రిషార్ట్స్ పై చర్యలు తీసుకోవాలని, రిషార్ట్ ను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని. చర్యలు తీసుకోకుంటే కలెక్టర్ దృష్టిలో పెడతామని కోర్టులు సైతం ఆశ్రయిస్తామని స్థానిక గిరిజనులు హెచ్చరిస్తున్నారు.చినలబడు పంచాయతీ కార్యదర్శి మహేష్ కు వివరణ కోరగా నాకు ఎటువంటి అనుమతుల కొరకు దరఖాస్తు చేయలేదని వారు స్పష్టం చేశారు.
