అల్లూరి జిల్లా కొయ్యూరు వారాంతపు సంతలో కొయ్యురు సీఐ
శ్రీనివాసరావు మంప ఎస్ఐ శ్రీనివాస్, APSP సిబ్బందితో కలిసి సంతను సందర్శించారు . ఈ సందర్భంగా కొయ్యూరు మండలానికి చెందిన బుదరాళ్ల పంచాయతీ కు చెందిన చీడిపల్లి, చలదిగడ్డ, బాలరేవుల, తీనరాయి, కునుకురు, పోకలపాలెం, తదితర గ్రామాలకు చెందిన గ్రామస్తులు,మంప, రేవల్ల పంచాయతీలకు చెందిన మారుమూల గ్రామాల గిరిజనులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ల గురించి అవగాహన కల్పించడంతో పాటు గంజాయి సాగు లేదా రవాణాకు సహకరించవద్దని సూచించారు . అలాగే గంజాయి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకూడదని .
అదనంగా నాటు సారా వలన కలిగే నష్టాలు, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, అధిక వేగం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాలలో ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావలసిందిగా ప్రజలకు కోరడం జరిగింది అని చెప్పారు.
కొయ్యురు సిఐ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం..
RELATED ARTICLES
