భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం భాగంగా, జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు వడ్డాది. ఎన్ టి ఎస్ స్కూల్‌లో వన్‌డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఏపీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ వి.వి. రామరాజు మార్గదర్శకత్వంలో, వరప్రసాద్ అక్షర స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
చోడవరం మరియు రావికమతం డివిజన్లకు చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 120 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు
ఈ శిక్షణలో స్కౌట్స్ అండ్ గైడ్స్ . ఏఐటి ట్రైనర్ స్వామి నాయుడు సోమేశ్ పాల్గొని ఉపాధ్యాయులకు ప్రాక్టికల్ మరియు ప్రేరణాత్మక శిక్షణ అందించారు. అదనంగా, స్కూల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వి.వి. రామరాజు మాట్లాడుతూ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేయడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు లభిస్తాయని తెలిపారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సమాజ పట్ల బాధ్యత, సహకార భావన, మానసిక ఉల్లాసం మరియు దేశభక్తి వంటి విలువలు అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు.
కార్యక్రమం చివరలో చైతన్య స్కూల్‌కు చెందిన రాంబాబు వందన సమర్పణ చేయగా, మొత్తం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
పిల్లలకి అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES
