గాంధీనగరంలో డి ఎన్ టీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి, మత్తు, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి సమస్త కార్యదర్శి తాతపూడి జయశ్రీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులు , యువకులు చదువును నిర్లక్ష్యం చేస్తూ విద్యను కోల్పోతూ, ఆనరోగ్యపరమైన సమస్యలకు లోను అవుతున్నారని అన్నారు మాదక ద్రవ్యాలకు మత్తులో అమ్మాయిలు, మహిళలు, విద్యార్థులు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దొంగతనాలు చేస్తున్నారన్నారు. మత్తు పదార్థాలను సరఫరాచేసేన , వాటికి అలవాటు పడిన, అసాంఘిక అలవాట్లను ప్రేరేపించే వారుగా, కారకులుగా శిక్షార్హులే అన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్,డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్జె న్సస్ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా మంచి నడవడిక, నైతిక విలువలు పెంపొందించుకుని మంచి పౌరులుగా ఎదగాలని యువతకు, పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వసతి గృహం వార్డన్ నారాయణరావు మాట్లాడుతూ బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ సమాజంలో కళాశాలలో పాఠశాలల్లో విద్యార్థుల కొరకు యువతీ యువకుల కొరకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారిలో నైతిక విలువలు సత్ప్రవర్తన అలబడటానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ అద్యక్షులు కాళ్ళ శివ శంకర్ సమస్త ప్రతినిదులు సిహెచ్ ప్రదీప్ కుమార్ పి.వి.కిరణ్మయి, , బి.బి.వి. ప్రసాద్ కె ఎస్ జ్యోతి కుమారి హాస్టల్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…
