Sunday, April 26, 2026
HomePoliticsAndhra Pradeshబాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన

బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన

రావికమతం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల చోడవరం సెక్టార్లో గల గర్ల్స్ హై స్కూల్ లో గురువారం విద్యార్థులకు బాల్యవివాహాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్స్ శాంతిప్రియ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేసుకోవడం నేరమని అందు వలన జరిగే అనర్ధాలు బాల్య వివాహాలు చేసుకుంటే తలెత్తే సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు పూర్తి కాకుండా పెళ్లి చేస్తే చట్టరీత్యా ఎదురుగా ఎదుర్కోవలసిన సమస్యలను శిక్షలు గురించి వివరించారు. బాల్య వివాహాలు జరిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో అనే విషయం తెలుపుతూ.. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 గురించి పిల్లలకు అవగాహన కల్పించారు. పాఠశాల బాలికలచే బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సెక్టార్ సూపర్వైజర్ బి శాంతిప్రియ ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం సెక్టార్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments