పతకావిష్కరణ చేయనున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్
పోలీస్ పరేడ్ మైదానంలో ఉదయం నుంచి ప్రారంభం కానున్న వేడుకలు ఆకట్టుకోనున్న సంక్షేమ, అభివృద్ధి శకటాలు, రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాల పంపిణీ పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఉద్దేశాలను, లక్ష్యాలను, సాధించిన ఫలితాలను తెలియజేసే విధంగా ఎనిమిది విభాగాల ఆధ్వర్యంలో స్టాళ్లు, మరొక ఎనిమిది విభాగాల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. జెండా వందనం జరిగే మైదానంలో పైలట్ వాహనానికి ట్రయిల్ రన్ నిర్వహించి సిద్దం చేశారు. గౌరవ వందనం సమర్పించేందుకు, పరేడ్ నిర్వహించేందుకు వీలుగా వివిధ రక్షణ బృందాల సభ్యులకు శిక్షణ అందజేశారు. ఎనిమిది పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నృత్యాలు చేసేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. పరేడ్ నిర్వహణకు, ఇతర కార్యకాలపాలకు ఎలాంటి ఇబ్బందులు మైదానంలో రోలింగ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. బ్యారెక్స్ ప్రాంగణంలోని గోడలకు, మెట్లకు జాతీయ జెండా నమూనాలతో కూడిన రంగులు వేశారు. ప్రధాన వేదికను పూలతో సుందరంగా అలంకరించారు. అభివృద్ధి.. సంక్షేమం.. ప్రతిబింబించేలా స్టాళ్లు, శకటాలు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలియజేస్తూ స్టాళ్లను, శకటాలను సిద్ధం చేశారు. రూ. 809 కోట్ల నగదు ప్రోత్సాహాకాలు అందజేత…! వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన 440 మంది సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
RELATED ARTICLES
