Saturday, May 2, 2026
HomePoliticsAndhra Pradeshదివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు

దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో మార్చి 18, 2026 నుండి ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని
ప్రభుత్వం కల్పిస్తోంది.విజయనగరం పరిహార ప్రాంతాల దివ్యాంగులకు అందరికీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని డిపో మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు.దివ్యాంగుల వెంట వచ్చే సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ వస్తుందన్నారు. దివ్యాంగులు తమ వైకల్య ధృవీకరణ పత్రం తో ఆర్టీసీ పాస్ పొందాలి, ఇది బస్సులో చూపించాల్సి ఉంటుంది.
నాన్-స్టాప్, ఇంటర్ స్టేట్, మరియు అల్ట్రా డీలక్స్ వంటి ఇతర బస్సుల్లో, పాత పద్ధతిలోనే 50 శాతం రాయితీ కొనసాగుతుంది. తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments