అరకు చలి ఫెస్ట్ గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటే అద్భుత వేదిక
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
డుంబ్రిగూడ మండలం అరకు పైనరీ వంటి ప్రాంతాలు పర్యాటకులకు ఒక కల లాంటి అనుభూతిని అందిస్తాయని కొనియాడారు.ఇక్కడి జీవనశైలిని పర్యాటకులకు పరిచయం చేయడానికి ఈ ‘చలి ఫెస్ట్’ ఒక గొప్ప అవకాశమని అభివర్ణించారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా స్థానిక సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతుందన్నారు.
ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో జరుగుతున్న ఈ వేడుకలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తాయన్నారు. జిల్లాలోని ప్రకృతి అందాలకు నిలయమైన అరకులోయ పర్యాటక రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. పర్యాటకుల కోసం త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యారవాన్ పార్క్ అందుబాటులోకి రానుందన్నారు. అరకులోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, కొత్తగా నిర్మించిన రోడ్లు, ఉదయాన్నే కురిసే పొగమంచు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విశాఖపట్నం నుండి కేవలం రెండు గంటల ప్రయాణంతో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చేరుకోవచ్చు. యువతకు స్ఫూర్తి -‘సే నో టు డ్రగ్స్’: జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహిస్తూ సైక్లింగ్ వంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. గంజాయి నిర్మూలన డ్రగ్స్ రహిత సమాజం పట్ల పర్యాటకు యువతకు అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం అరకు ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఉదయం 09.00 గంటలకు లోతేరు జంక్షన్ నుండి అరకు పైనరీ వరకు నిర్వహించిన సైక్లింగ్ కార్యక్రమాన్ని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీ పూజ జెండా ఊపి ప్రారంభించిన ఈ సైక్లింగ్ కార్యక్రమం గంజాయి నిర్మూలన నినాదంతో కొనసాగింది. అరకు సైక్లింగ్ 2026 పోటీలలో 42 పాల్గొనగా 1) విశాఖపట్నంకి చెందిన కె. వంశీ కిరణ్ మొదటి స్థానo కైవసం చేసుకొని రూ 25,000/- 2) ఎన్ అఖిలేష్ ద్వితీయ స్థానంలో కైవసం చేసుకొని రూ.15,000/- 3)జి శ్యాం మనోహర్ తృతీయ స్థానం కైవసం చేసుకొని రూ.10,000/- జిల్లా కలెక్టర్, అతిథులు అభ్యర్థులకు నగదు పారితోషికం అందజేశారు. మొదటి స్థానం కైవసం చేసుకున్న జాతీయ సైక్లింగ్ ప్లేయర్ కె. వంశీ కిరణ్ తన స్పందన వివరించారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ అరకు ఫెస్టివల్ లో మోస్ట్ వెల్కమ్. ఈరోజు మన ఈ సైకిల్ ర్యాలీలో ముఖ్యమైన విశాఖపట్నం నుండి మరియు మిగతా ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసి.. ఈ సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ మనకి గతంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి జరుగుతున్న పనిని ఒక స్టేట్ లెవల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ రోజు మనకి ప్రెసెంట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అతిథులు సే నో టు డ్రగ్స్ టీ-షర్ట్స్ ని విడుదల చేశారు. అరకులో ఎక్కువ పర్యాటక ప్రదేశాలు ఉండడం వల్ల అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని ప్లాస్టిక్ వినియోగం, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.కార్యక్రమంలో అతిథులు గిరిజన నృత్యం చేయడం కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒక ఉత్సాహం చోటు చేసుకుంది.
అరకు చలి ఫెస్ట్ సంస్కృతిని ప్రపంచాని కి చాటే అద్భుత వేదిక
RELATED ARTICLES
