Home Uncategorized సమస్యలు పరిష్కారానికి ఏపీటీఎఫ్ ధర్నా

సమస్యలు పరిష్కారానికి ఏపీటీఎఫ్ ధర్నా

0

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో చోడవరం తాలూకా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. చోడవరం, చీడికాడ, బుచ్చయ్యపేట, మాడుగుల, రావికమతం, కె కోటపాడు, దేవరా పల్లి మండలాల ఏపీటీఎఫ్ ప్రతినిధులు సుమారు 150మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు తమరాన త్రినాధ ప్రారంభించి మాట్లాడారు. 12వ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని, అంతవరకూ 30% మధ్యంతర మృతిని చెల్లించాలని, బకాయి ఉన్న నాలుగు కరువు భత్యాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలను నిర్వీర్యం చేస్తుందని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో కలపడం సరికాదని పిఎస్ హెచ్ఎం పోస్టును అర్హత గల ఎస్ జి టి లకు మాత్రమే ఇవ్వాలని అలాగే 2009 ముందు నియమించిన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు తమరాన త్రినాధ అనకాపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు ఎస్ దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులు మోసూరి మహాలక్ష్మి నాయుడు
జిల్లా కార్యదర్శి ఏ ప్రసాదరావు,రాష్ట్ర కౌన్సిలర్ విజయలక్ష్మి , శ్యాం కుమార్, చోడవరం మండల శాఖ గౌరవ అధ్యక్షులు గొల్లు శ్రీనివాసరావు అధ్యక్షులు ఆర్ చిరంజీవి ,పూర్వ ప్రధాన కార్యదర్శి బి వి కె కిషోర్, బుచ్చయ్యపేట మండల శాఖ అధ్యక్షులు పి శేషు కుమార్, మరియు చీడికాడ ప్రధాన కార్యదర్శి ఎం టివి ఫణి కుమార్, రావికమతం అధ్యక్షులు హరిప్రసాద్, సుధీర్ కుమార్ ,మాడుగుల సన్యాసిరావు, కోటపాడు శ్రీనివాసరావు,లలిత ప్రసాద్, దేవరపల్లి శ్రీనివాసరావు, సింహాచలం నాయుడు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version