Sunday, May 31, 2026
HomePoliticsAndhra Pradeshవిశాఖ లో మరో దారుణం...!

విశాఖ లో మరో దారుణం…!

భార్యను హత్య చేసిన భర్త
– పోలీసుల అదుపులో నిందితుడు

అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేసాడు. భార్యను చంపి ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్న భర్తను… బైక్ ఆధారంగా ఆ ఇంటి సమీపంలోనే ఉన్నట్టు గుర్తించారు. చున్నీతో పీక నులిపి హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ఆరిలోవ బాలాజీ నగర్లో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలు దుర్గ (33) నగరంలోని లైఫ్ స్టైల్ లో పనిచేస్తుంది. ఆరిలోవలోని బాలాజీ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉలిక్కిపడ్డారు. తన కుమార్తె దుర్గ అనుమానాస్పద స్థితిల్లో మృతి చెందినట్లు తండ్రి నర్సింహులు చేసిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇంటి తలుపు లోపల నుంచి తాళం వేసి ఉండటంతో విరగగొట్టి లోపలికి వెళ్లగా, మెడపై గాయాలతో ఆమె మృతదేహం కనిపించిందని ఆమె తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త బురదపాటి దేముడు (42) భార్య దుర్గ ను చున్నీతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు లో వుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments