Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradesh*ఘనంగా విజయ దుర్గాదేవి వార్షిక ఉత్సవాలు*

*ఘనంగా విజయ దుర్గాదేవి వార్షిక ఉత్సవాలు*

జీవీఎంసీ 45 వార్డు పరిధిలోని సాలిగ్రామపురం సత్యసాయినగర్ విజయ దుర్గాదేవి ఆలయం 20 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆదివారం అమ్మవారి సారె ఊరేగింపుతో ముగిసాయి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సత్యసాయినగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి వివిధ అభివృద్ధి పనులను ప్రతిపాదించామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కార్యక్రమంలో నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె దీపిక, కార్పొరేటర్ కంపా హనోకు, సత్యసాయినగర్ గ్రామ అధ్యక్షుడు భరణికాన రాజు యాదవ్, టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments