Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshబెన్నవోలులోపశు ఆరోగ్య శిబిరం

బెన్నవోలులోపశు ఆరోగ్య శిబిరం

చోడవరం మండలం బెన్నవోలు గ్రామంలో పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో శుక్రవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ పశు ఆరోగ్యశిబిరాలు ఈనెల 31వ వరకు గ్రామాలలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు, గొర్రెలు, మేకలకు, దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.గొర్రెలు మేకలకు మసూచి వ్యాధి టీకాలు వేయడం జరిగింది. పాడిపశువులకు గర్భ కోశ వ్యాధులకు సంబంధించిన చికిత్స చేసి వాటికి తగిన మందులు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ ముడెడ్ల శంకరరావు ఇతర నాయకులు హాజరయ్యారు. పశు సంవర్ధకశాఖ నుంచి ఏరియా పశువైద్యశాల చోడవరం అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు,గవరవరం పశువైద్యాధికారి డాక్టర్ అచ్యుతరాము, సచివాలయం సిబ్బంది వెంకటరావు, రాంబాబు, ఈశ్వరసాయి, మురళీ , ల్యాబ్ టెక్నీషియన్ శ్రీదేవి పాల్గొని ఆరోగ్యం బాగోలేని పశువులు కు పేడ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments