రాష్ట్రాన్ని మనమే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
నాగలక్ష్మి, డైరెక్టర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్
చెత్త రహిత పాలనకు ప్రజలు అందరూ సహకారం అందించాలి అని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి. శుక్రవారం మద్దిలపాలెం శ్రీ భావన విద్యా నికేతన్ కరస్పాండెంట్ శ్యామ్ కుమార్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం, స్వచ్చాంధ్ర కార్పొరేషన్, ఎస్ ఆర్ యు – జి విఎంసి లో నేతృత్వంలో స్వచ్చాంధ్ర -స్వర్ణాంధ్ర కార్పొరేషన్ లో “చెత్త రహిత పరిపాలన” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దాలని కోరారు. విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ అవగాహన కల్పించారు. మేధావులు సహకారం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంద కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లా ఐసిసి కోఆర్డినేటర్ శృతి శ్రీ మాట్లాడుతూ విద్యార్థులు, మహిళలు, నగరవాసులు అందరూ చెత్త రహిత నగరంగా విశాఖ మహానగరాన్ని తీర్చి దిద్దడానికి కంకణబద్ధులై జీవించాలని కోరారు. మన అందమైన నగరాన్ని ఒక సుందరమైన విధంగా తీర్చి దిద్దాలని కోరారు. వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేసి ఎవరి ఇంటి వద్ద వారె కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం అవసరం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి,పాల్గొన్నారు
