Home News బిసివై పార్టీ కన్వీనర్‌గా ఆకుల వెంకట స్వామి

బిసివై పార్టీ కన్వీనర్‌గా ఆకుల వెంకట స్వామి

0

భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్‌గా ఆకుల వెంకట స్వామిని నియమించినట్టు పార్టీ అధిష్టానం తెలిపింది. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం, ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వ లక్షణాలు, క్షేత్రస్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ కీలక బాధ్యతను ఆయనకు అప్పగించారు.
పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ, సామాజిక రంగాల్లో అనుభవం కలిగిన వ్యక్తిగా ఆకుల వెంకట స్వామికి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజాసేవలో ముందుండే నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాంటి నాయకుడికి జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత ఊపునిస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆకుల వెంకట స్వామి మాట్లాడుతూ, జిల్లా కన్వీనర్‌గా తనపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించిన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. బిసివై పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.
.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version