జనసేన నేత గురాన అయ్యలు
ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సముచిత స్థానం కల్పించారన్నారు.
వికసిత్ భారత్ విజన్‌ను ప్రతిబింభించేలా బడ్జెట్ ఉందని ప్రశంసించారు. మహిళా, పేదల, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. జాతీయ సౌభాగ్యానికి ఈ బడ్జెట్ ఓ ముందడుగు అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌కు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 3,300 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించడం హర్షణీయమన్నారు.
రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించిందని, వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందన్నారు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు
పర్యాటకానికి, హాస్పిటాలిటికి కూడా ప్రాధాన్యం ఇచ్చారని, మన రాష్ట్రంలో అరకులో టూరిజం పెరగడానికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. కొబ్బరి, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయన్నారు.
డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారని తెలిపారు.
దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
