Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshకల్తీ నెయ్యి సెగలు

కల్తీ నెయ్యి సెగలు

అసెంబ్లీలో హైవోల్డేజ్ చర్చ

శ్రీవారి సన్నిధిలో మహాపచారం

ఎన్డీడీబీ రిపోర్టు వచ్చినా తొక్కిపెట్టారు

తప్పు చేస్తే చర్యలు తప్పవు

సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం ‘కల్తీ నెయ్యి’ సెగలు పుట్టించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ కల్తీ అంశంపై శాసనసభలో హై-వోల్టేజ్ క్రియేట్ చేసింది. ఒకవైపు భక్తుల సెంటిమెంట్.. మరోవైపు వ్యాపార భాగస్వామ్యాల చుట్టూ తిరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో.. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చివరగా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతపై తలెత్తిన వివాదం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చకు దారి తీసింది. మంగళవారం శాసనసభలో జీరో అవర్‌ రద్దు చేసి కల్తీ నెయ్యిపై సుదీర్ఘంగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ కొనసాగింది. నెయ్యి వ్యవహారంపై 10 మంది కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడారు. అసెంబ్లీలో తిరుమల లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది మత విశ్వాసాలకు విఘాతం కలిగించేలా చేసిన గత వైసీపీ పాలకుల తీరుని ఎండగట్టారు. ఎవరికి ఏ బాధ వచ్చినా వేంకటేశ్వరస్వామిని మొక్కుకుని ఆయనతో చెప్పుకుంటాం. అలాంటిది ఆయన సన్నిధిలోనే అపచారం జరగడం దారుమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య చాలా సార్లు వేంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం పట్ల ఆవేదన చెందామన్నారు. ఎన్నో ఆందోళలనలు కూడా చేశామని తెలిపారు. వేంకటేశ్వరస్వామికి అన్యాయం జరగుతోంది, దేవాలయాలపై దాడులు జురుగునత్నాయని పోరాడితే కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు. అందులో నేనూ బాధితుడిన్నే.. రామతీర్థంలో రాముడి తల నరికారని అక్కడికి వెళ్తే నాపైనా కేసుల పెట్టారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యాక మొదటి సంతకం ప్రిన్సిపల్ సెక్రటరీ నియామకం కోసం, రెండోదీ టీటీడీ ఈవో నియామక దస్త్రంపై చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. నెయ్యి అంశంపై ఎన్డీడీబీ రిపోర్టు నుంచి వచ్చినదాన్ని బట్టే ఎన్డీయే సమావేశంలో వివరించానన్నారు. తప్పు చేస్తే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అంతకు ముందు టీటీడీ బోర్డు సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఫిబ్రవరి29, 2020 నుంచే టీటీడీలో కల్తీ నెయ్యి బాగోతం మొదలైందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తీసుకు వచ్చిన నెయ్యి పేకరణ టెండర్ల నింబధనలు నాటి పర్చేజ్‌ కమిటీ సమావేశంలో మార్చారని ఆయన అన్నారు. అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాటి పర్చేజ్‌ కమిటీలో భూమన కరుణాకర్‌ రెడ్డి.. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లారని, ఆ ఇద్దరి ఒత్తిడితోనే నెయ్యి సేకరణ టెండర్ల నింబధనలు మార్చారని జ్యోతుల అన్నారు. గత ప్రభుత్వ తీర్మానాలు పక్కన మార్చి నెయ్యి కల్తీకి పాల్పడ్డారని,నెయ్యి కల్తీలో నిజమైన బాధ్యులను శిక్షించాలని జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments