- అనంతగిరిలో ఆదివాసీ సత్య గ్రహ యాత్ర ప్రారంభం!
- సీఎం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి.
- రంపచోడవరం జిల్లా ప్రకటించినందుకు కృతజ్ఞతలు.
అనంతగిరి, జయ జయహే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలచట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ రామారావు దొర డిమాండ్ చేశారు.
ఆదివాసీ జేఏసీ రెండవ ప్రధాన డిమాండ్ రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రాంతమైన పోలవరం జిల్లాకు ఆదివాసి పోరాట యోధుడు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని కోరారు. అనంతగిరి మండలంలోకి బుధవారం ఆదివాసి సత్య గ్రహ యాత్ర చేరుకోవడంతో అనంతగిరి నుండి మారుమూల గ్రామాలకు ఈ సత్య గ్రహ యాత్రను ఆదివాసి జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర ప్రారంభించారు, అనంతరం అయన మాట్లాడుతూ…తమ హక్కుల రక్షణ కోసం సుదీర్ఘంగా చేస్తున్న పోరాటాల ఫలితంగా ఒక్కొక్కటిగా పరిస్కారం అవుతున్నాయని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం సాధించి ఆదివాసి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ఆదివాసీ జెఎసి చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్-3 రద్దు అయిన తర్వాత ఆదివాసులకు న్యాయం చేస్తానని ప్రకటించిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబేనని, ఆలస్యం చేయకుండా తక్షణమే ఉద్యోగ నియామకాల చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకల చట్టం చేసి తమ మాటను నిలుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర తోపాటు యాత్రలో పాల్గొన్న పాంగి అంజీరావు,బుడిదే మాధవరావు, అనంతగిరి మండల కన్వీనర్ పాంగి రవీంద్ర, బద్నాయిని చంటి, కొర్ర సూర్యనారాయణ, లొంగుపర్తి సర్పంచ్ జన్ని సన్యాసిరావు, డానియెల్, మహిళలు పాల్గొన్నారు.
