జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు గురువారం మాడుగుల చీడికాడ మండలంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మాడుగుల బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో గల వివిధ సబ్జెక్టులో ప్రగతి , 10వ తరగతి విద్యార్థులు ప్రగతి ,నోట్స్ పుస్తకాలు కరెక్షను పేపర్ల భద్రత తదితర అంశాల గురించి చర్చించి పరిశీలనలో సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న తప్పులను సరి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం ప్రధానోపాధ్యాయులు వాసు అధ్యక్షతన వివిధ మండలాల నుండి సబ్జెక్టు టీచర్లు పాల్గొన్నారు. ఇంతకుముందు ఆ బృందం చీడికాడ మండలం కోణం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరీక్షించి వారి నోట్స్ పుస్తకాలు పరిశీలించి ప్రభుత్వం వారు విద్యపై పూర్తి స్థాయిలో పధకాలు ఇస్తున్న తరుణం లో,దానికి ఫలితంగా పదో తరగతిలో మంచి మార్కులు తో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణులు కావాలని సూచించారు అలాగే సబ్జెక్టు టీచర్స్ 10వ తరగతి విద్యార్థులు కు పరీక్ష ల పట్ల భయం లేకుండా ఏ విధంగా పరీక్షల కు హాజరుకావాలో వివరించారు.
