అల్లూరి జిల్లా కొయ్యురు మండలం లోని కాకరపాడు జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలనీ ప్రయానికులు కోరుతున్నారు.జాతీయ రహదారి నిర్మాణం లో భాగంగా బస్సు షెల్టర్ ని తొలగించారు.ఇప్పటి వరకు బస్సు షెల్టర్ నిర్మించకపోవడం వలన ప్రయాణికులు ఎండైనా వానైనా రోడ్డు ప్రక్కనే నిల్చొని ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారుల చూసి చూడనట్లు ఉంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి బస్సు షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు..
