Home Uncategorized విశాఖ కలెక్టర్ గా అభిషిక్త్ కిశోర్

విశాఖ కలెక్టర్ గా అభిషిక్త్ కిశోర్

0

కాకినాడకు హరేంధిర ప్రసాద్ బదిలీ

పలువురు ఐఏఎస్ ల ట్రాన్సఫర్

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ కలెక్టర్‌ షణ్మోహన్‌‌ను ఏపీఈడీబీ సీఈవోగా బదిలీ చేసింది. ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌‌ను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేసింది. సాయికాంత్‌ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా.. అభిషిక్త్‌ కిశోర్‌‌ను విశాఖ జిల్లా కలెక్టర్‌గా.. హరేంద్రప్రసాద్‌‌ను కాకినాడ జిల్లా కలెక్టర్‌గా.. టి.నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా.. తమిమిన్‌ అన్సారియాను పాఠశాల విద్య డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా కలెక్టర్ బదిలీ కావడంతో, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ జిల్లా జాయింట్ కలెక్టరే.. కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తారని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version