Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshపీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్ అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశాలు
గ్రీవెన్స్ ద్వారా అందిన అర్జీలు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సర్వే శాఖకు సంబంధించిన రీ–ఓపెన్ కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ, వాటిని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS)తో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి తక్షణ పరిశీలన చేపట్టారు. అన్ని అర్జీలను నిర్ణీత గడువులో, ఎస్‌ఎల్‌ఏ పీరియడ్‌లోపే నాణ్యతతో పరిష్కరించాలని, పరిష్కారం అనంతరం తప్పనిసరిగా ఎండార్స్మెంట్ జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 147 అర్జీలు నమోదయ్యాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 62, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి 59, హోం శాఖ 9, ఇతర శాఖలవి 17 ఉన్నాయి. భూ ఆక్రమణలు, RoR, రీ సర్వే, 22(A) తొలగింపు వంటి అంశాలపై ఎక్కువగా అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments