13వ రోజు ప్రవచన యజ్ఞంలో సామవేదం షణ్ముఖ శర్మ
భాగవత పఠనంతో శాంత జీవనం కలుగుతుందని వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, ఆరో సెక్టార్, ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం 13వ రోజైన మంగళవారం రాత్రి ప్రవచనకర్త బృందావనంలో నుంచి మధుర, ద్వారక నగరాలకు బలరామ సహిత శ్రీకృష్ణుడి ప్రయాణాన్ని అందుకుగల కారణాలను వర్ణంచారు. మహాశివరాత్రి రోజున సరస్వతీ నదిలో స్నానం చేసి రాత్రి విశ్రాంతిలోకి వెళ్లేసమయంలో కొండచిలువ ఆయనను సమీపించినపుడు గోపికలు ఆందోళన చెందగా శ్రీ కృష్ణుడే స్వయంగా తన అరికాలిని కొండ చిలువకు అందించడంతో శాపవిమోచనం కలిగి సుదర్శన మహర్షి ప్రత్యక్షమవ్వడం, అరిష్టుడు అనే మహా రాక్షసుడ్ని, వృషభాన్ని కొమ్ములు పట్టుకొని దూరంగా విసిరి సంహరించినపుడు, కేశి, వ్యోమ అనే ఇద్దరు రాక్షసుల్నీ సంహరించినపుడు శ్రీ కృష్ణుని ప్రతాప స్వరూపాన్ని చూడగల్గుతామన్నారు. భగవత్ సంకల్పాన్ని భూమి మీద ప్రవర్తింపజేసిన మహర్షి నారదుడు కృష్ణుని మేనమామ కంసుని వద్దకు వెళ్లి నందుని పుత్రుడు కాదు. దేవకీ, వసుదేవుల తనయుడని చెవిన వేశాడని సామవేదం అన్నారు. కంసుడు కోపంతో దేవకీ వసుదేవుల్ని సంహరింపజూసి వారిద్దర్నీ చెరసాలలో బంధించాడని వివరించారు.
ఆ తర్వాత కంసుడు బలరాముడ్నిమట్టుబెట్టే ఉద్దేశంతో యాగానికి రమ్మని యదువంశ ప్రధాని అక్రూరుడ్ని వెళ్లి తీసుకురమ్మన్నాడు. అక్రూరుడు రథంపై వెళ్లి నపుడు కృష్ణ బలరాములు పాలు పితికి తెస్తసూ ఆ పాత్రను పక్కనున్నవారికిచ్చి తన పాదాలపై పడిన అక్రూరుడ్ని తన చేతులు భుజంపై వేసి పైకి లేపి ఆలింగనం చేసిన సందర్భాన్ని కళ్లకు కట్టారు. కృష్ణ బలరాముల్ను తన రధంపై ఎక్కాక బయల్దేరే ముందు నీటిలోకి చూడగానే ఆ నీటిలో కష్ణ, బలరాములు కనిపించారు. ఆ తర్వాత వేయిపడగలతో ఆదిశేషుడు, నారాయణుడు కనిపించగా వీరి లీల తెలుసుకున్నాడన్నారు. మధుర, ద్వారక నగరాలలో కృష్ణుడి ఐశ్వర్యలీలల తెలుసుకోవాలన్నారు. భాగవత కథ వింటే శ్రీ కృష్ణుడి రాజనీతి శాస్త్రం నైపుణ్యాలు పరిపాలనా దక్షులతో రాజ్యమేలడానికి తగినవారిని పురమాయించిన విధం తెలుస్తుందన్నారు.
