ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్ ఎస్ ఏ డీఈలు, ఎంఈఓలతో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం మరియు అమలులో ఉన్న విద్యా కార్యక్రమాల పురోగతిపై ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశంలో పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు మరియు ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అలాగే ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ ఎస్ ఏ
అధికారులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.
