Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshపొట్టి శ్రీరాములుకు ఘన నివాళి*

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి*

తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి క్యాంప్ కార్యాలయంలో సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు పేరిట ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించిందన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమార్, భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమిన రామస్వామి నాయుడు, కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా అప్పలకొండ, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, కొప్పల రమేష్, కనకల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments