Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshకొత్త అమావాస్య జాతరకు సిద్ధమైన నూకాంబిక అమ్మవారు

కొత్త అమావాస్య జాతరకు సిద్ధమైన నూకాంబిక అమ్మవారు

ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల ఇలవేల్పు ఆరాధ్య దైవం అయినా శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారీ కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యయి. ఈ కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ పి నాగ శ్రీను (గొల్ల బాబు) ఆలయ కార్య నిర్వహణ అధికారి వై శ్రీధర్ తెలియజేశారు ఈనెల 17 నుండి వచ్చే నెల 17 వరకు నెల రోజులు పాటు అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి ఉత్సవాలు జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. మూడు జిల్లాలు ఉండే కాకుండా అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుటకు భక్తులు విచ్చేస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారూ . వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని చల్లని చలువ తాటాకు పందిర్లు మంచినీటి సదుపాయాలు మజ్జిగ ప్యాకెట్లు చిన్న పిల్లలకు పాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని అలాగే భారీ విద్యుత్తు లైటింగ్ స్టేజి ప్రోగ్రాములు నేలవేషాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎల్లవేళలా విద్యుత్తు ఏర్పాట్లు పర్యవేక్షించుటకు ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు చెత్తను తీసుకొని పోయే విధంగా అలాగే ఉత్సవాల ఎటువంటి అగ్ని ప్రమాదాలు గలాటాలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఫైర్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని వారు పేర్కొన్నారు. అలాగే అమ్మవారి ఊరేగింపు ఘటాల ఊరేగింపు పట్టణ పురవీధి గుండా ఘనంగా ఊరేగింపు జరిగాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments