Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshవిద్యార్థినికి ఆర్థికసహాయం అందించిన మనమ్ సేవా సొసైటీ

విద్యార్థినికి ఆర్థికసహాయం అందించిన మనమ్ సేవా సొసైటీ

మనమ్ సేవా సొసైటీ తరఫున తగరపువలస అంబేద్కర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి కి ఆర్థిక సహాయం అందచేసారు మహేశ్వరీ తండ్రి రోడ్లపై స్క్రాప్ సేకరించే పని చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది . మహేశ్వరి చదువులో టాపర్‌గా నిలుస్తూ క్రీడల్లో కూడా మంచి ప్రతిభ చూపుతోంది. ఆమె విద్యను ప్రోత్సహించేందుకు స్కూల్ యూనిఫాం స్టిచింగ్ ఛార్జీలు మరియు 3 నెలల ట్యూషన్ ఫీజు కోసం మొత్తం రూ.3000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా మనమ్ సేవా సొసైటీ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల విద్యార్థులు బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులు సాధిస్తే, వారిలో టాప్ 3 మంది విద్యార్థులను ఎంపిక చేసి మనమ్ సేవా సొసైటీ ద్వారా ఉచితంగా ఇంటర్‌మీడియట్ చదివేలా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ పాఠశాల ఇన్‌చార్జ్ హెడ్‌మాస్టర్ ఎస్. జగదీష్ తెలుగు ఉపాధ్యాయులు అప్పలరాజు , మనమ్ సేవా సొసైటీ కార్యకలాపాలను ప్రశంసిస్తూ సొసైటీ వ్యవస్థాపకుడికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments