Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshమీ బాధ్యతను నిర్వర్తించండి

మీ బాధ్యతను నిర్వర్తించండి

పార్టీ బలోపేతానికి కృషిచేయండి
– నూతన పరిశీలకులతో కె.కె రాజు

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అరుకు నియోజకవర్గం పరిశీలుకులుగా జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస రావు, చీపురుపల్లి నియోజకవర్గ పరిశీలకురాలుగా విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, విశాఖ జిల్లా పార్టీ మున్సిపల్ విభాగం అధ్యక్షురాలుగా కోడిగుడ్లు పూర్ణిమ అండ్ శ్రీధర్, అనకాపల్లి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా గొండి సిద్దు నూతనంగా నియమితులైన సందర్భంగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు ని జిల్లా పార్టీ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు..
ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ పార్టీలో పదువులు పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు ,14 వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు,యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్,పి.నారాయణ,పుల్లేటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments