అమెరికా ఈ క్యూ ఫర్ పీస్ సంస్థ అధ్యక్షులు మాట్ పేరెల్ స్టెయిన్స్
అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు భావోద్వేగ మేధస్సును అర్థం చేసుకొని అభివృద్ధి చేసుకోవడంతో పాటు తమ జీవితాల్లో శాంతి భావాన్ని పెంపొందించుకోవాలని అమెరికా లోని ఈ క్యూ ఫర్ పీస్ సంస్థ అధ్యక్షుడు మాట్ పేరెల్స్టెయిన్ సూచించారు. శనివారం గోపాలపట్నం శ్రీ మురళీకృష్ణ డిగ్రీ కాలేజిలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల్లో విజయాన్ని సాధించడానికి భావోద్వేగ మేధస్సు ఎంతో కీలకమని తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించడంలో, ఒత్తిడిని నియంత్రించడంలో మరియు సమతుల్యమైన జీవితాన్ని గడపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మ్యాట్ పెరెల్స్టైన్ను కళాశాల వర్గాలు ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ప్రతినిధి వి.ఎన్.ఎస్. ప్రసన్న కుమార్, డీన్ ప్రొఫెసర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్, చైర్పర్సన్ వి. మహాలక్ష్మి, ప్రిన్సిపాల్ శ్యామ్ వల్లభరావు, టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
