Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshజీవీఎంసీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

జీవీఎంసీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

స్త్రీ శక్తి విలువ పెరిగింది.

* జీవీఎంసీ ప్రాంగణంలో మహిళా పార్కు

– నగర మేయర్ పీలా శ్రీనివాసరావు .

మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ మినిస్ట్రీయల్ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ , జెమ్స్ మహిళా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ మహిళ అధికారులు, ఉద్యోగులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ మినిస్ట్రీయల్ సర్వీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, స్త్రీ శక్తి చాలా గొప్పదని, అన్ని రంగాలలో పురుషుల తో సమానంగా మహిళలు పనిచేస్తున్నారని, శ్రమించడంలో ఆడపిల్లలే ప్రథమ స్థానంలో ఉన్నారని, జీవీఎంసీ పరిధిలో ఎంతోమంది మహిళలు ఉన్నత స్థానంలో పనిచేస్తూ జీవీఎంసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, గతంలో పనిచేసిన మహిళ కమిషనర్ సృజన నిర్ణయాలు చాలా గొప్పగా ఉండేవని కొనియాడారు. మహిళల కొరకు జీవీఎంసీ ప్రాంగణంలో ప్రత్యేకంగా మహిళా పార్కును ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ అభివృద్ధికి మహిళల పాత్ర అధికంగా ఉందని మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని, మీ బాధ్యతలు పై దృష్టి సారించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు విధులు నిర్వహించాలని, మహిళలో చిన్నప్పటి నుంచే మనోధైర్యాన్ని నింపాలని, మహిళలు ఇటు ఉద్యోగంతో పాటు ఇంటిని చక్కదిద్దే పనిని కూడా చేస్తారని, వారి సేవలు వెలకట్టలేమని జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి పేర్కొన్నారు. భారతదేశంలో మహిళలకు ఒక గౌరవ స్థానం ఉందని, ప్రపంచంలోనే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అయినప్పటికీ కొంత వివక్షత భారతదేశంలో 1920వ సంవత్సరం నుండి మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగిందని, మహిళల యొక్క హక్కులను కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని జివిఎంసి అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి తెలిపారు. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ సకల దేవతలు ఉంటారని, మహిళలను అందరూ గౌరవించాలని, సృష్టికి మూలం స్త్రీ అని, పూలే వంటే సంఘ సంస్కర్తలు మహిళలు ఉన్నతకి ఎంతో కృషి చేశారని, నేడు ఉద్యోగం, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అదనపు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. అనంతరం ఆయన రచించిన జగతికి ఆధారం మహిళ, అమ్మే ఆధారం అను పాటలను వినిపించారు.

అనంతరం వేదికనలంకరించిన జాయింట్ డైరెక్టర్ (అమృత్) విజయభారతి తదితరులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వారి సందేశాన్ని అందించారు.

జీవీఎంసీ మహిళా అధికారులు, ఉద్యోగులు జీవీఎంసీ ప్రాగణంలో మహిళా పార్కు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందున మేయర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఫోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, స్పోర్ట్స్ డైరెక్టర్ ఈ ఏ రాజు, జేమ్స్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పద్మజ, పర్యవేక్షకులు హెన్నా, సన్యాసిరావు, అధిక సంఖ్యలో జీవీఎంసీ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments