బహుజన టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
ప్రభుత్వం వేతన కమిషన్ నియమించాలి
రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పరిష్కార మార్గం లేకుండా ఉపాధ్యాయ ఆర్థిక ఆర్థికేతర సమస్యలను తక్షణమే ప్రభుత్వము న్యాయంగా పరిశీలించి పరిష్కారo చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సీ ర రమేష్ బాబు తెలిపారు.
దీర్ఘకాలికంగా పరిష్కారం లేని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్నామని ఇందులో భాగంగా ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు నిరసన వారోత్సవాలు చేపడుతున్నామని ఈ మేరకు ఉపాధ్యాయులంతా నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతున్నామని ఆయన అన్నారు, గత ప్రభుత్వం అపరిస్కృతంగా ఉంచిన ఈ బకాయిలను తక్షణమే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల సాధక బాధకాలను అర్థం చేసుకొని వెంటనే పరిష్కరించాలని బి టి ఏ డిమాండ్ చేస్తుందన్నారు.
బి టి ఏ ఉపాధ్యాయ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ బద్ధంగా ఆలోచించి ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించి తక్షణమే ఐ ఆర్ మధ్యంతర భృతిని, కల్పించి, వేతన కమిషన్ను నియమించాలని, పెండింగులో ఉన్న అన్ని ఉపాధ్యాయ బకాయిలను తక్షణమే చెల్లించాలని భోజన టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా బుడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్లాక్ రిబ్బన్లతో తమ విధులను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బి టి ఏ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సీర రమేష్ బాబు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ పూర్ణచంద్రరావు, జిల్లా ఎన్జిసి అధ్యక్షులు పూజారి గోవిందరావు, ఉపాధ్యాయులు కే వెంకట్రావు, ఎం అనురాధ, కె చిన్న పెంటయ్య, ఇమ్రాన్ బేగ్, ఎస్ టి యు రాష్ట్ర కార్యదర్శి పడాల తమ్మి నాయుడు తదితరులు పాల్గొని బి టి ఏ పోరాటానికి సంఘీభావం తెలిపారు.
